calender_icon.png 17 January, 2026 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ ఆర్థిక వ్యవస్థలో విశ్వకర్మల పాత్ర

17-01-2026 01:20:09 AM

కొత్తపల్లి, జనవరి 16(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం మొగ్దూంపూర్ లో విశ్వబ్రాహ్మణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్  ముఖద్వార నిర్మాణ పనుల్లో భాగంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గత 11 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం విశ్వకర్మ సమా జా నికి చెందిన సంప్రదాయ వృత్తిదారుల సంక్షే మం, ఆర్థిక స్వావలంబన, నైపుణ్యాభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించిందన్నారు. స్కిల్ ఇండియా, డీడీయూ జీకేవై వంటి కార్యక్రమాల ద్వారా విశ్వకర్మలకు ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు బండి సంజయ్ 41 డివిజన్ వావిలాలపల్లి లో కరీంనగర్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.  అట్లాగే 46వ డివిజన్ లో కేబీ బ్యాంకెట్ హాల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావు, మాజీ కార్పొరేటర్ బండారు వేణుతోపాటు స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు.