17-01-2026 03:51:17 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (విజయక్రాంతి): చారిత్రక గోల్కొండ కోట సాక్షిగా హైదరాబాద్ నగరంలో సాహస క్రీడల సందడి మొదలైంది. పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ శుక్రవారం గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కి ఆకాశ మార్గంలో విహరించి అందరినీ ఆశ్చర్యపరిచారు.దాదాపు 13 కిలోమీటర్ల మేర సాగిన ఈ గగనతల విహారం తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
నేడు ఆకాశంలో ఎగురుతున్న ఈ బెలూన్లు.. తెలంగాణ పర్యాటక రంగం ప్రపంచ స్థాయి ఎత్తులకు చేరుకోబోతోందనడానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తెలంగాణ పర్యాటక రంగంలో ఇదొక కొత్త అధ్యాయమని అభివర్ణించారు. ఒకవైపు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ద్వారా మన సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యాన్ని చాటుతున్నాం.. మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్ ద్వారా ఆధునిక సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ఇలా సంప్రదా యం, టెక్నాలజీ కలబోతగా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దుతున్నాం అని తెలిపారు.
తెలంగాణలోని సహజ సౌం దర్యాన్ని, చారిత్రక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. డెస్టినేషన్ తెలంగాణ బ్రాండ్ను బలోపేతం చేస్తూ, కేవలం దేశీయ పర్యాటకులనే కాకుండా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇలాంటి సాహసోపేత క్రీడలు దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానం ద్వారా ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తూ, పీపీపీ పద్ధతిలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. తద్వారా స్థానిక యువతకు ఉపాధి, ఆదాయ మార్గాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ క్రాంతి వల్లూరి, ఇతర పర్యాటక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పరేడ్ గ్రౌండ్స్‌లో..
సికింద్రాబాద్: చారిత్రక పరేడ్ గ్రౌండ్స్‌లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హాట్ ఎయిర్ బెలూన్ ప్రదర్శన నగరవాసులను మం త్రముగ్దులను చేసింది. శుక్రవారం సాయంత్రం పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ప్రదర్శనను ప్రారంభించారు. గాలిలో తేలియాడే రంగురంగుల బెలూన్లకు పచ్చజెండా ఊపి నింగిలోకి పంపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ తెలంగాణ పర్యాటక రంగానికి అంతర్జాతీ య గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని చె ప్పారు. పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, ఎండీ క్రాంతి వల్లూరి పర్యవేక్షణలో ఏ ర్పాటైన ఈ వేడుకలో పలువురు ఉన్నతాధికారు లు పాల్గొన్నారు. ఆకాశంలో విహరిస్తున్న భారీ బె లూన్లను చూసేందుకు నగరవాసులు భారీగా తరలివచ్చారు. చిన్నారుల కేరింతలు, సందర్శకుల సె ల్ఫీలతో పరేడ్ గ్రౌండ్స్ ప్రాంగణం కళకళలాడింది.