17-01-2026 03:49:48 AM
సికింద్రాబాద్ జనవరి 16 (విజయ క్రాంతి): ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ క్యాలెండర్ను డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీయూటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి సంయుక్తంగా డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీయూటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడాల శివకుమార్, న్యాయవాది సి. సత్యనారాయణ, విద్యావేత్త జె. రామరాజు,
హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల టీఎన్జీ వోస్ అధ్యక్షుడు వరకల సత్యనారాయణ, వైద్య శాఖకు చెందిన ఎం. జయేందర్, డి.శ్రీధర్,ఎం.శ్రీశైలం సాగర్,ఎ. సురేందర్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలపై సమష్టిగా ముందుకు సాగాలని, టీయూటీయూసీ భవిష్యత్తులో మరింత బలంగా ఉద్యమాలు చేపడుతుందని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.