10-11-2025 01:28:42 AM
న్యూఢిల్లీ, నవంబర్ 9: భారత్‌కు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్లను పోలీసులు విదేశాల్లో అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ ఆపరేషన్‌లో భాగంగా జార్జీయాలో వెంకటేశ్ గార్గ్, అమెరికాలో భాను రాణాలను అదుపులోకి తీసుకున్నట్లు హరియాణా పోలీసులు తెలిపారు. హరియాణాలోని నారాయణగఢ్‌కు చెందిన వెంకటేశ్ గార్గ్‌పై దేశంలో పది కేసులు ఉన్నాయి. గురుగ్రామ్‌లో బీఎస్పీ పార్టీ నాయకుడి హత్య కేసులో నిందితుడి ఉన్నాడు. హరియాణాలోని కర్నాల్‌కు చెందిన మరో గ్యాంగ్‌స్టర్ భానురాణా లరెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌లో కీలక సభ్యుడు. హరియాణా, ఢిల్లీ, పంజాబ్‌లలో పలు కేసుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.