28-07-2025 12:03:43 AM
వైద్యులను అభినందించిన డీసీసీ అధ్యక్షుడు సీఆర్ రావు
నిర్మల్, జూలై 2౭ (విజయక్రాంతి): ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలోని మొట్టమొదటిసారిగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవ్‌బాయ్ హాస్పిటల్‌లో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ప్రారంభించిన వైద్యులను డిసిసి అధ్యక్షుడు సీఆర్ రావు అభినందించారు.
ఇక్కడి ప్రజల సౌకర్యం కోసం దేవ్ బాయ్ హాస్పిటల్ వైద్యు లు డాక్టర్ చంద్రిక డాక్టర్ అవినాష్ నిర్మల్‌లో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని వారిని సన్మానం చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంచిర్యాల చౌరస్తా ఖానాపూర్ రోడ్డులో దేవిబాయి హాస్పిటల్‌లో డాక్ట ర్ చంద్రిక నూతన ఫర్టిలిటీ (టెస్ట్ ట్యూబ్ బేబీ ) సెంటర్, లాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు ఆదివారం హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్, దేవరకోట ఆలయ చైర్మన్ శ్రీనివా స్, కాల్వ ఆలయ చైర్మన్ మహేందర్, ఇంజనీర్ సందీప్, అరవింద్, నరేష్ రెడ్డి, లింగన్న, చిరంజీవి, లింగరెడ్డి, నర్సారెడ్డి, సురేష్, తదితరులున్నారు.