28-07-2025 12:04:28 AM
నకిరేకల్, జులై 27: నకిరేకల్ మండలం లోని చందంపల్లి ప్రాథ మికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు డు కనుకుంట్ల నవీన్ రెడ్డి జాతీయస్థాయి ఉపాధ్యాయ శిక్షణకు ఎంపికయ్యారు. నూతన విద్యా విధానం (ఎన్ పీ-2020) ద్వారా బోధన, అభ్యాసన పద్ద తులను సృజనాత్మకంగా మార్చేందుకు జాతీయ స్థాయిలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి నవీన్ రెడ్డి ఒక్కరే ఎంపికయ్యారు ఆయనను’ బెస్ట్ ప్రాక్టీస్ టీచర్’గా అధికా రులు గుర్తించారు..
రాజ స్థాన్ ఉదయపూర్లో భారత ప్రభుత్వ సెంటర్ ఫర్ కల్చరర్ రిసోర్స్, ట్రైనింగ్ (సీసీ ఆర్టీ)కేంద్రంలో ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 10 వరకు నిర్వ హించే శిక్షణలో ఆయన పాల్గొంటారు. ఈయన శిక్షణలో పాల్గొనేందుకు అనుమ తిస్తూ డీఈవో శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు ఉపాధ్యాయులు నవీన్ రెడ్డిని అభినందించారు.