calender_icon.png 31 December, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొమ్మ గన్ ఉపయోగించి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడి అరెస్ట్

31-12-2025 12:00:00 AM

జనగామ, డిసెంబర్ 30 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున మధ్యాహ్నం 02:30 గంటలకు బాధితుడు అయిన మల్లి సతీష్ జనగామ లోని గవర్నమెంట్ ఆసుపత్రి ముందు ఉన్నటువంటి సింధు లిక్కర్ మార్ట్ లో తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా నిందితుడు అయిన ఇంజ ప్రశాంత్ అలియాస్ ప్రసాద్ తండ్రి ఐలయ్య,వయసు, గబ్బెట గ్రా మం, రఘునాథపల్లి మండలం కు చెందిన నిందితుడు తన వద్ద ఉన్న బొమ్మ గన్ ఉపయోగించి.

బాధితుడు అయినటువంటి మల్లి సతీష్ తల పై అట్టి బొమ్మ గన్ పెట్టి 5 వేల రూ పాయలు ఇవ్వకుంటే నిన్ను చంపుతా అని బెదిరించడం తో బాధితుడు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మంగళవారం రోజున నిందితున్ని జనగామ చౌరస్తా వద్ద ఉద యం 11గంటలకు ఎస్త్స్ర భరత్ అరెస్ట్ చేసి అతని వద్ద నుండి బొమ్మా తుపాకి స్వాధీనపర్చుకొని, నిందితున్ని రిమాండ్ చేశారు. నిందితున్ని పట్టుకోవటంలో ప్రతిభ కనబరిచిన ఎస్త్స్ర భరత్, కానిస్టేబుల్స్ అయిన కృష్ణ,సాగర్, చరణ్ లను డిసిపి, ఏసిపి అభినందించారు.