08-07-2025 12:54:42 AM
- యువజన సర్వీసులు, గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి?
- తన శాఖలపై మంత్రి వాకిటి శ్రీహరి అసంతృప్తి
కరీంనగర్, జూలై 7 (విజయక్రాంతి): గత పదేళ్లలో ఆగమైన శాఖలను తనకు ఇచ్చారని, ఇది అదృష్టమో దురదృష్టమో తెలియదంటూ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయని ఆయన వా పోయారు.
అదృష్టమో దురదృష్ట మో తెలియదుగానీ.. పదేళ్లలో ఆగమైన ఐదు శాఖలు తనకు అప్ప గించారని అసంతృప్తిని వ్యక్తం చేశా రు. తనకు ఇచ్చిన పశుసంవర్థక శాఖ గందరగోళంగా ఉన్నదన్నారు. గతం లో గొర్రెల పంపిణీలో అవినీతి జరిగిన శాఖను తనకు అప్పగించార న్నారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖను ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు.
యువజన సర్వీసులు, గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. తనకు అప్పగించిన యువజన శాఖ ద్వారా తాను ఉద్యోగాల అవకాశాలు ఎలా కల్పించాలని ప్రశ్నించారు. అయితే ఈ శాఖలన్నింటిని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తానని మంత్రి శ్రీహరి చెప్పారు. సోమవారం కరీంనగర్ పర్యటనలో భాగంగా మత్స్యకారుల సంక్షేమంపై అవగాహన సదస్సులో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు. ముదిరాజ్ సంఘం వారు శ్రీహరిని సన్మానించిన సందర్భంలో భావోద్వేగంతో ప్రసంగించారు.