calender_icon.png 23 December, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవా కార్యక్రమాలే మైత్రి ఫౌండేషన్ లక్ష్యం

23-12-2025 12:00:00 AM

* సామూహిక శ్రీమంతాలతో ఆరవ వార్షికోత్సవం

* ఫౌండేషన్ చైర్మన్ చెన్నం శెట్టి ఉదయ్ కుమార్ 

గుమ్మడిదల, డిసెంబర్ 22 : నిరుపేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడమే మైత్రి ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్ చెన్నంశెట్టి ఉదయ్కుమార్ తెలిపారు. సంస్థ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలో గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో సుమారు 40 మంది గర్భిణీ స్త్రీలకు సాంప్రదాయబద్ధంగా సామూహిక శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ఎంపీడీఓ ఉమాదేవి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉదయ్కుమార్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా గుమ్మడిదల మండలం పరిసర ప్రాంతాల ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముఖ్యంగా ఉచిత అంబులెన్స్ సేవలు, బ్లడ్ డొనేషన్, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ వంటి పలు కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ మానస్విని, హెచ్‌ఈఓ శ్రీనివాస్, అతిథులు చంద్రిక, సుస్మిత, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.