calender_icon.png 23 December, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుస హత్యల నిందితుడికి జీవిత ఖైదు

23-12-2025 12:00:00 AM

రామాయంపేట సీఐ వెంకటరాజా గౌడ్ 

చిన్నశంకరంపేట(చేగుంట), డిసెంబర్ 22 :వరుస హత్యలకు పాల్పడిన నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.60వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చిందని రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్ తెలిపారు. 2024 సంవత్సరం అక్టోబర్ నెలలో చిన్నశంకరంపేట ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో మల్లేష్ అనే వ్యక్తి నవీన్ను బండరాయితో మోదీ హత్య చేసి, మృతదేహంపై చెత్త కాగితాలు వేసి నిప్పంటించిన ఘటన జరిగిందని తెలిపారు.

అనంతరం అదే ఏడాది నవంబర్ నెలలో నిజామాబాద్కు చెందిన స్వామి అనే వ్యక్తిని హత్య చేశాడని తెలిపారు. ఈ ఘటనలపై ఎస్‌ఐ నారాయణ గౌడ్ కేసు నమోదు చేయగా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకట రాజా గౌడ్ సమగ్ర దర్యాప్తు నిర్వహించి కీలక సాక్ష్యాలను సేకరించారు. రెండు హత్య లలో సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా జడ్జి నీలిమ నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.60,000 జరిమానా విధించారని తెలిపారు. ఈ కేసు విచారణలో పబ్లిక్ ప్రాస్క్యూటర్ వెంకటేష్, లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ విట్టల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ అశోక్ కేసులో సహకరించాలన్నారు.