27-12-2025 01:15:46 AM
రోగి ప్రాణాలు కాపాడిన వైద్య బృందం
హైదరాబాద్, డిసెంబర్ 26 : హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అత్యంత విషమ పరిస్థితిలో ఉన్న అబ్దుల్ ఖాదీఫ్ (4౩) అనే రోగికి లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్(ఎల్‌డీఎల్‌టీ)ను విజయవంతంగా నిర్వ హించి అతని ప్రాణాలను కాపాడారు. 18 అక్టోబర్ 2025 న నిర్వహించిన ఈ శస్త్రచికిత్సకు ముందు రోగి అడ్వానస్డ్ డీకంపెన్సేటెడ్ క్రానిక్ లివర్ డిసీజ్ తో బాధపడుతూ, తీవ్రమైన పోర్టల్ హైపర్టెన్షన్, భారీ అసైటిస్, జీర్ణాశయ రక్తస్రావం , గ్రేడ్III హేపాటిక్ ఎన్సెఫలోపతి వంటి ప్రాణాపాయకర సమస్యలను ఎదుర్కొన్నాడు.
శస్త్రచికిత్సకు ముందు సు మారు 12 రోజుల పాటు స్పృహలేని స్థితిలో ఉన్న రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉండేది.లివర్ పరీక్షల్లో బిలిరుబిన్ స్థాయి 37 ఎంజీ/డీఎల్ వరకు పెరగడంతో అత్యవసర లివర్ మార్పిడి అవసరమైంది.ఈ క్లిష్టమైన లివర్ మార్పిడి శస్త్రచికిత్సను డా. కిషోర్ రెడ్డి, లీడ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో, అనుభవజ్ఞులైన వైద్య బృందం విజయవంతంగా నిర్వ హించింది.
ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది మేము నిర్వహించిన అత్యంత క్లిష్టమైన లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కేసుల్లో ఒకటి. రోగి తీవ్ర స్థితిలో ఉన్నప్పటికీ, సకాలంలో తీసుకున్న నిర్ణయాలు, శస్త్రచికిత్సలో నైపుణ్యం, వైద్య బృందం సమన్వ యం వల్ల ఈ ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని కాపాడగలిగాం. చివరి దశ లివర్ వ్యాధిగ్రస్తులకు కూడా సరైన సమయంలో చికిత్స అందితే కొత్త జీవితం ఇవ్వవచ్చు అన్నారు.
ఈ విజయవంతమైన శస్త్రచికిత్సలో డాక్టర్ కృష్ణగోపాల్ భండారి కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరా లజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, డాక్టర్ ఎస్బీఎస్ శ్రీనివాస్ హెడ్ ఆఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనస్థీషియా & లివర్ క్రిటికల్ కేర్, డాక్టర్ అజయ్ శేశరావ్ షిండే కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాం ట్ ఫిజీషియన్, డాక్టర్ కె. శ్రీకాంత్ కన్సల్టెంట్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంట్ అనస్థీషియా పాల్గొన్నా రు.
లివర్ మార్పిడి అనంతరం రోగిని ట్రాన్స్‌ప్లాంట్ ఐసీయూలో నిరంతర పర్యవేక్షణలో ఉంచారు.డిశ్చార్జ్ సమయంలో రోగి వైద్యపరంగా స్థిరంగా ఉండి, నోటి ద్వారా ఆహారం తీసుకుంటూ పునరావాస చికిత్స కొనసాగిస్తున్నాడు.ఈ విజయం లివర్ ట్రాన్స్‌ప్లాంట్ బృందం నైపుణ్యం, సమన్వయం, ఆధునిక వైద్య సదుపాయాలకు నిదర్శనంగా నిలుస్తుందని హాస్పిటల్ వర్గాలు పేర్కొన్నా యి.