04-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 3 : తెలంగాణ బ్యాడ్మింటన్‌లో విషాదం నెలకొంది. బ్యా డ్మింటన్ క్రీడాకారులు ఏవీఎస్ మూర్తి గుం డెపోటుతో మృతి చెందారు. బ్యాడ్మింటన్‌లో పలు విజయాలు సాధించిన ఆయన అకాల మరణం క్రీడాప్రపంచాన్ని కలచివేసింది. ఆట పట్ల అంకితభావం, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తె చ్చుకున్నారు. యువ క్రీడాకారులకు సైతం మార్గదర్శిగా నిలిచి బ్యా డ్మింటన్‌పై మక్కువను చాటుకున్నారు.
ఏవీఎస్ మూర్తి అకాల మర ణం బ్యాడ్మింటన్‌కు తీరని లోటని పలువురు క్రీడాకారులు, కోచ్‌లు సంతాపం తెలిపారు. ఆయన సాధించిన వి జయాలు, అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని చెప్పుకొచ్చారు. ఏవీఎస్ మూర్తి కుటుంబసభ్యులకు బ్యాడ్మింటన్ క్రీడావర్గాలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి.