calender_icon.png 4 November, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10న నిర్వహించే బీసీ రిజర్వేషన్ల సాధన సభను విజయవంతం చేయాలి

03-11-2025 01:55:58 AM

కామారెడ్డి, నవంబర్ 2 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల సాధన సభ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 10 న నిర్వహిస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు తెలిపారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని జిల్లా స్థాయి బీసీ రిజర్వేషన్ల సాధన సమితి సమావేశానికి ముఖ్య అతిథులుగా జస్టిస్ ఈశ్వరయ్య రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, డాక్టర్ విశారదన్ మహారాజులు హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయాలని వారు కోరారు.