calender_icon.png 18 August, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రాష్ర్టంలో బీసీలదే రాజ్యాధికారం

18-08-2025 12:00:00 AM

  1. రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ కుట్ర 
  2. రాజరాజకీయ లబ్ధి కోసమే కవిత బీసీ జపం 

నిజామాబాద్, ఆగస్టు 17(విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ర్టంలో భవిష్యత్తులో బీసీలదే రాజ్యాధికారం అని తెలంగాణ శాసన మండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఒక హోటల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా బీసీలను అగ్రవర్ణాలు అనుగదొక్కే కుట్ర పన్నుతూ బీసీల మీద కూడా చేస్తున్నారన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలు ఐక్యత చాటాలని అగ్రవర్ణాలను రాజకీయ సమాధి చేయడమే తమ ఏకైక లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అనేది కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక నాటకం అని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల పేరిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా ఆడుతున్నాడని బీసీల పట్ల రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లను సాధించాలని ఆయన సూచించారు.

బీసీలను మరోసారి మోసం చేసేందుకే రేవంత్ రెడ్డి బీసీ నినాదంతో తెలంగాణలో ఆందోళనకు తినలేకపోయారని ఆయన అన్నారు. బీసీలకు రిజర్వేషన్లు సాధిస్తే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న శపథం చేశారు బీసీలను మించిన రాజకీయ శక్తి మరొకటి లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవితతో తనకి ఎలాంటి విభేదాలు లేవని కానీ ఆమె బీసీ కాదని బీసీ నినాదంతో ఆమెకేం సంబంధం అని కవితను ఆయన ప్రశ్నించారు.

2028 ఎన్నికలలో మా ఓట్లు మా సీట్లు అనే నినాదంతో ఎన్నికల బరిలో పోటీ చే సి బీసీల సత్తా చాటడానికి పూర్తిగా రంగం సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. బీసీ నినాదంతోనే ఎన్నికల బరిలోకి వెళ్లి సత్తా చాటుతామన్నారు. తాను చేపట్టే బీసీ ఉద్యమానికి ప్రజలే వెంటుండి నడుపుతున్నారని భవిష్యత్తులో ప్రజాదరణ బిసి వర్గాల నుండి ముఖ్యంగా ఉంటుందని ఆయన భీమ వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుధా గాని హరిశంకర్ గౌడ్ బీసీ పొలిటికల్ జేఏసీ సమన్వయకర్తలు జానయ్య యాదవ్ సంగం సూర్యారావు బుస్సాపూర్ శంకర్ బీసీ జేఏసీ నాయకులు బాస రమేష్ యాదవ్ రమేష్ పటేల్ బి నరేందర్ సతీష్ గౌడ్ తాళ్లపల్లి చంద్రశేఖర్ ప్రవీణ్ ముదిరాజ్ బీసీ జేఏసీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు