04-11-2025 12:10:22 AM
							తుర్కయంజాల్, నవంబర్ 3: కార్మికుల సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ, వారి హక్కుల సాధన కోసం సీఐటీయూ పోరాడుతుందని ఆ సంఘం రంగారెడ్డిజిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ అన్నారు. సీఐటీయూ అనుబంధ యూనియన్ బీఎంపీఎస్ జిల్లా మహాసభల వాల్ పోస్టర్‌ను తుర్కయంజాల్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ ఈనెల 10, 11 తేదీల్లో కాటేదాన్‌లో జరిగే బీఎంపీఎస్ 4వ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై మహాసభల్లో చర్చిస్తామన్నారు. కార్మికుల హక్కుల పరిష్కారం కోసం తీర్మానాలు రూపొందిస్తామని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, కొత్త జవోల పునరుద్ధరణపై చర్చించి ఐక్య ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ తుర్కయంజాల్ మున్సిపల్ నాయకులు యం.సత్యనారాయణ, బీఎంపీఎస్ నాయకులు ఎం.అంజయ్య, బి.యాకయ్య, కె.నాంపల్లి, కె.యాదయ్య, కె.యాదగిరి, సీహె కుమార్, పి.పోతురాజు, వేల్పుల కుమార్, కె.రమేష్, ఎస్.మురళి, వి.సతీష్, కె.సోమయ్య, బి.ఐలయ్య, కోటిరెడ్డి, టి.సత్యనారాయణ, జె.కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.