calender_icon.png 27 October, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగని ఇన్‌ఫార్మర్ హత్యలు

27-10-2025 12:38:26 AM

ఇద్దరిని హతమార్చిన మావోయిస్టులు 

చర్ల, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఇన్‌ఫార్మర్స్ నెపంతో ఇద్దరు యువకులను మావోయిస్టులు హతమార్చారు. ఓ పక్క మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ అత్యంత దూకుడుగా సాగుతున్న వేళ చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్‌ఫార్మర్ నెపంతో శనివారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా హత్య చేశారు.

జిల్లాలోని ఉసూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నేల కాంకేర్ గ్రామానికి చెందిన రవి కట్టం(25), తిరుపతి సోడి (38)లను పదునైన ఆయుధలతో హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై విచారణ సాగిస్తున్నారు. ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున బలగాలను తరలించారు.