calender_icon.png 2 December, 2025 | 1:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీవరేజ్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన

02-12-2025 12:00:00 AM

అబ్దుల్లాపూర్ మెట్, డిసెంబర్ 1 :  భారీ పోలీస్ బందోబస్తుతో పెద్ద ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం పనులు ప్రారంభించారు. సోమవారం ప్రారంభించిన ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణ పనులను అడ్డుకోకుండా పోలీసులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలను ముందస్తు అరెస్టు చేసి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ తరలించారు.

కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండెం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు కాలనీవాసులతో కలిసి ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అంతకు ముందు మున్సిపల్ మాజీ చైర్మన్ కాంగ్రెస్ నాయకులు పండుగుల జయశ్రీరాజు, మాజీ వైస్ చైర్మన్ సిద్దెంకి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ యూత్ నాయకులు పాలడుగు నాగార్జున,  బీజేపీ నేత పిల్లి శ్రీనివాస్, చంటి,  బీఆర్‌ఎస్ నేత దండెం రాంరెడ్డిలను  అరెస్టులు చేశారు.

అనంతరం వారు పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ... పెద్ద అంబర్‌పేట్ సర్వేనంబర్ 292లో 3 ఎకరాల ఈదుల చెరువు ఎఫ్‌టీఎల్‌లో సీవరేజ్ ట్రీట్ మెంట్ స్టాంట్ (ఎస్టీపీ) నిర్మాణం పనులు  ప్రారంభించడం అన్యాయన్నారు.