02-12-2025 12:17:10 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, డిసెంబర్ 1 ( విజయక్రాంతి ) : ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమని, తమ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకుని పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం మదనాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు తమ విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకుని పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. పిఓ ఏపీవోలు పోలింగ్ రోజు చేపట్టాల్సిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. తహసిల్దార్ మోహన్, ఎంపీడీవో ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.