calender_icon.png 2 December, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బందోబస్తు నిర్వహణలో సిబ్బందికి ప్రశంసలు

02-12-2025 12:15:44 AM

ఎస్పీ సునీతా రెడ్డి

వనపర్తి క్రైమ్, డిసెంబర్ 1 : రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  ఎనుముల రేవంత్ రెడ్డి ఆత్మకూరు శంకుస్థాపనల పర్యటన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, పూర్తి శాంతియుత వాతావరణంలో విజయవంతంగా కొనసాగింది. వనపర్తి జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి, ప్రత్యక్ష పర్యవేక్షణలో సమగ్ర బందోబస్తు ఏర్పాట్లు చేసి, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేశారని  ఎస్పీ అన్నారు.

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, కానిస్టేబుల్ స్థాయి వరకు అందరూ చూపిన కర్తవ్యనిబద్ధత ప్రశంసనీయమైనది. విభాగాల మధ్య అద్భుత సమన్వయం, సమయపాలన, శ్రద్ధతో వ్యవహరించడం వలన పర్యటన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగిసింది.తమవిధుల్లోఅంకితభావంతో విధులు నిర్వహించిన ప్రతి పోలీసు సిబ్బందికి ఎస్పీ ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.