02-12-2025 12:15:32 AM
ములకలపల్లి, డిసెంబర్ 1,(విజయక్రాంతి):ఎయిడ్స్ వ్యాధి అత్యంత ప్రమా దకరమని ఒకసారి శరీరంలో ప్రవేశిస్తే దానికి మందు లేదని నివారణ ఒక్కటే మా ర్గం అని మంగపేట వైద్య సిబ్బంది తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్స వం సందర్భంగా సోమవారం ములకలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంగపేట ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ సూపర్వైజర్ కృష్ణ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి మానవ శరీరంలో ఎర్ర రక్త కణాలపై దాడి చేసి రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుందని చెప్పారు. ఎయిడ్స్ వైరస్ రక్తంలో మాత్రమే సజీవంగా ఉంటుందని శరీరం వెలుపల ఎక్కువ కాలం జీవించదని విద్యార్థులుగా ఎయిడ్స్ వ్యాపించే విధానాన్ని తెలుసుకొని ఉండాలని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కల్పన ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అతేహార్ ఆలీ, రాజేశ్వరి, రామకృష్ణ, చంద్రశేఖర్, కుమారస్వామి, చంద్రమౌళి, సుచరిత, అనిత, రజిని, సుప్రియ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.