calender_icon.png 10 January, 2026 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ పోరులో బీజేపీ సత్తా చాటాలి

08-01-2026 12:00:00 AM

జిల్లా అధ్యక్షులు రాజ్ భూపాల్ గౌడ్

చేవెళ్ల, జనవరి 7(విజయక్రాంతి): రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీచేసి సత్తా చాటుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్ అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా బుధవారం చేవెళ్ల పట్టణ కేంద్రంలోని వీరయ్య గార్డెన్ లో బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా  జిల్లా అధ్యక్షులు  మాట్లాడుతూ... మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలపై కేసులు పెడితే కొట్లాడే దమ్ము, ధైర్యం బీజేపీకి ఉందని తెలిపారు. భవిష్యత్ తరాలకు మంచి అభివృద్ధి అందించాలంటే బీజేపీ నాయకులు అన్ని స్థానాల్లో పోటీచేసి సత్తా చాటాలని సూచించారు. మున్సిపాలిటీ స్థానాల్లో ఎవరికి ఎక్కడ టికెట్లు ఇచ్చిన అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయమే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మాట్లాడుతూ... చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల, శంకర్ పల్లి, మొయినాబాద్ మున్సిపాలిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ బలంగా ఉందని, అన్ని మున్సిపాలిటీ స్థానాల్లో బీజేపీ కార్యకర్తలు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మున్సిపాలిటీ స్థాయిలో బీజేపీకి ఓట్లు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రధాని నరేంద్ర మోడీ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు బీజేపీపై మొగ్గు చూపుతున్నారని తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు కంచర్ల ప్రకాష్,  బీజేపీ మాజీ మండల అధ్యక్షులు దేవర పాండురంగారెడ్డి,  బీజేపీ మున్సిపల్  అధ్యక్షులు అత్తిలి అనంత్ రెడ్డి, యువ నాయకులు డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్ది, మండల అధ్యక్షులు శ్రీకాంత్, జిల్లా నాయకులు కుంచం శ్రీనివాస్, సామ మాణిక్య రెడ్డి, ఆంజనేయులు గౌడ్, జి.వెంకట్ రెడ్డి, నాయకులు కృష్ణ గౌడ్, జయశంకర్ గౌడ్, పలుగుట్ట బాలయ్య, వెంకట్ రామిరెడ్డి, సామ కృష్ణారెడ్డి మల్లేష్, ఇంద్రసేనారెడ్డి బాల్ రెడ్డి, అల్లాడ శ్రీనివాస్ రెడ్డి, పత్తి సత్యనారాయణ, వెంకటేష్, కృష్ణమోహన్, శ్రీనివాస్, రాఘవేందర్ రెడ్డి, జయసింహ రెడ్డి తదితరులు ఉన్నారు.