calender_icon.png 11 January, 2026 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంధ్రా జలదోపిడీపై పోరాటం

08-01-2026 12:00:00 AM

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ

ముషీరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న జలదోపిడీపై సమగ్రంగా చర్చించి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే దిశగా పోరాటం చేయనున్నట్లు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ కృష్ణను మింగిండ్రు- గోదావరి మీద పడ్డరు అనే అంశంతో ఈ నెల 16న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జలరంగ నిపుణులు, మేధావులతో సమావేశం నిర్వహిస్తున్నామని ప్రకటించారు.

పోలవరంబనకచర్ల లిఫ్ట్ నుంచి పోలవరంనల్లమల సాగర్ లిఫ్ట్ వరకు 424 టీఎంసీల జలదోపిడీకి ఆంధ్రప్రదేశ్ ముంద స్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని, దీనికి కేంద్ర ప్రభుత్వం మౌన సహకారం అందిస్తున్న తీరుపై ఈ సమావేశంలో చర్చ జరుగుతుందని తెలిపారు. తెలంగాణ జల వనరులపై జరుగుతున్న అన్యాయాన్ని చరిత్ర క్షమించదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, నాగుల శ్రీనివాస్ యాదవ్ మీనగ గోపి, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.