08-01-2026 12:00:00 AM
ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ కుమార్
కుషాయిగూడ జనవరి 7 (విజయక్రాంతి): సీపీఐ శతాబ్ద ఉత్సవాల సందర్భం గా ఏఐటీయూసీ కాప్రా సమితి అనుబంధ ఎన్‌ఎఫ్ సీ- ఈసీఐఎల్ కార్మిక సంఘాల సంయుక్తంగా ఆధ్వర్యంలో ఈసీఐఎల్ లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్‌లో అణు ఇంధ న బిల్లును రద్దు చేయాలని అనే అంశంపై పై సదస్సు నిర్వహించారు.ఈ సదస్సు కోటి బాబు అధ్యక్షతన జరిగింది.ఈ సదస్సుకు ఎఐటియుసి జాతీయ కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సెక్టార్ యూనియన్ల జాతీయ నాయకులు సి.శ్రీకుమార్ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులు ప్రభుత్వ మెడపై కత్తిపెట్టినట్లుగా అణుశక్తి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి, పార్లమెంట్లోని ప్రతిపక్షాలు అణుశక్తి బిల్లుపై వెలుబు చ్చిన సందేహాలకు ప్రభుత్వం నుండి ఎలాం టి సమాధానం ఇవ్వకుండా అప్ప్రజాస్వామికంగా బిల్లును ఆమోదించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి విఎస్. బోస్, కార్మిక నాయకులు నారా నర్సింహా, జోషి కుమార్, నర్సింహా రావు, మోహన్, గంధాలు, ఉపేందర్ రెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.