27-12-2025 12:43:05 AM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): జనవరి 26 వరకు బీటి రోడ్డు నిర్మాణం పనులను పూర్తి చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సంబంధిత కాంట్రాక్టర్ కు సూచించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణపూర్ గ్రామ శివారులోని సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే రోడ్డుకు రూ.99 లక్షలతో బీటీ రోడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి వేయించిన రోడ్లపై కేజీ వీల్స్ తో ట్రాక్టర్ నడపడం వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని రైతులు సహకరించాలని కోరారు.
రోడ్లపై కేజీ విల్ ట్రాక్టర్ నడిపినట్లైతే జరిమానా విధించాలన్నారు, ఈ విషయంపై సంబంధిత ట్రాక్టర్ యజమానులతో సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలని ఎస్‌ఐ చంద్రకుమార్ కు సూచించారు.
గ్రామంలో రెండు సిసి రోడ్లు మంజూరు చేయించాలని సర్పంచ్ గుడుగుల సతీష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సర్పంచులు గుడుగుల సతీష్ , ఉత్తమ కుమారి, ఉప సర్పంచులు. రామారావు, తిరుపతిరావు, నాయకులు పన్నాల రాములు , రఘుపతిరావు, తిరుపతిరావు, సాగర్ రావు, చిలుక సతీష్ , మండల రమేష్ , మాధవరావు, రాములు, దేవేందర్ , పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.