calender_icon.png 27 December, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు పట్టిన శని బండి

27-12-2025 12:44:27 AM

తెలంగాణ ఉద్యమంలో బండి సంజయ్ ఎక్కడున్నారు?

మానకొండూరు, డిసెంబర్ 26( విజయ క్రాంతి )తెలంగాణకు పట్టిన శని బండి సంజయ్ అని కరీంనగర్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఘాటుగా విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో బండి సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షా, స్వరాష్ట్రాన్ని కొట్లాడి సాధించిన కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితువు పలికారు.

ఎవరెంత అవాకలు , చేవాకులు అసత్యాలు, దూషణలు, ఆరోపణలు చేసిన చరిత్రలో కేసీఆర్ స్థానం చెరిగి పోదని తేల్చి చెప్పారు. శుక్రవారం నియోజకవర్గ, మండల కేంద్రమైన మానకొండూరు లోని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో రామంచ గోపాల్ రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, సాయవేణి రాజు, రాచకట్ల వెంకటస్వామి, శామంతుల శ్రీనివాస్, బోడ రాజశేఖర్ తదితరులతో కలిసి మీడియా సమావేశంలో రామకృష్ణారావు మాట్లాడారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు, బండి సంజయ్ కుమ్మక్కయ్యారని వీరి వ్యవహార శైలి ప్రజలు గమనిస్తున్నారన్నారు.

హైడ్రా మూసి కూల్చివేతలపై సంజయ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయని, చెక్ డ్యాములు కూల్చి వేసిన చర్యలు శూన్యమని, నీటి వనరుల దోపిడీ జరిగినా చర్యలు ఉండవని పరోక్షంగా చురకలాంటించారు. హరితహారం, మిషన్ భగీరథ, మాతా శిశు సంక్షేమం, తదితర పథకాలపై కేసీఆర్ పాలనలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అవార్డులు ప్రకటించడం బండికి తెలియవా అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కేసీఆర్ ఆధ్వర్యంలో టీబి రహిత జిల్లాగా అవార్డులు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిందని, కేసిఆర్ పై అర్థరహిత విమర్శలు ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. కృష్ణా పాలమూరుకు సంబంధించిన అంశాలపై బండికి ఏమి తెలుసని మీడియా సాక్షిగా ప్రశ్నించారు. ఈ అంశాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తపరిచారు.

పాలమూరు వెనుకబాటుకు కేసీఆర్ అని అసత్య ప్రచారం చేయడం పై జీవీఆర్ మండిపడ్డారు. రేవంత్, బండి సంజయ్ దొందు దొందే అని వ్యాఖ్యానించారు. 90 శాతం పాలమూరు ప్రాజెక్టు పూర్తయిందని నీటి వాటాను ప్రభుత్వం ఎందుకు వదిలేసుకుందో, ప్రాజెక్ట్ వ్యతిరేకి అయిన ఆంధ్రా అధికారి ఇక్కడ సలహాదారులుగా ఎందుకు పెట్టుకున్నదో సంజయ్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహులు బండి, రేవంత్ అని రామకృష్ణారావు విమర్శించారు.