calender_icon.png 18 July, 2025 | 12:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమం,అభివృద్ధిపైనే కేంద్రం దృష్టి

17-07-2025 01:04:00 AM

కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్ర

కుమ్రంభీం అసిఫాబాద్, జూలై 16(విజయ క్రాంతి):ప్రజా సంక్షేమం అభివృద్ధి పై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్ర అన్నారు. బుధవారం జిల్లాలోని తిర్యాణి,ఆసిఫాబాద్ వాంకిడి మండలాల్లో  జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అదనపు కలెక్టర్  దీపక్ తివారి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, పాల్వాయి హరీష్ బాబులతో కలిసి విస్తృతంగా పర్యటించారు.

తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామంలో గిరిజనులు సాంప్రదాయ గుస్సాడీ నృత్యం ద్వారా స్వాగతం పలికారు. పి.వి.టి.జి.ల దేవతల ఫోటోలకు, శాటిలైట్ సెంటర్ పాఠశాల స్థల ప్రదాత టేకం భీమ్ పటేల్ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం లో భాగంగా పి.వి.టి.జి.ల కొరకు ఏర్పాటుచేసిన ఆధార్ కేంద్రాన్ని పరిశీలించారు.

అనంతరం వాకిలి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి మందుల నిల్వలను పరిశీలించారు రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దిశగా వైద్యులు సిబ్బంది కృషి చేయాలన్నా రు. లింకు కూడా గ్రామంలో ప్రధానమంత్రి జన్మాన్ పథకం నిర్మించిన ప్రయోజన కేం ద్రాన్ని పరిశీలించారు.

కేంద్రాల ద్వారా అన్ని సేవలు ఒకే చోట అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న తెలిపారు. ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ లో 19 లక్షలతో నిర్మించిన ఆదర్శ అంగన్వాడి కేం ద్రాన్ని సందర్శించి గర్భిణీలు బాలింతలు పిల్లలకు అందిస్తున్న పోషక ఆహారంపై సమీక్షించారు. భారత్ ఎలక్ట్రానిక్ డిలీటెడ్ సౌజ న్యంతో ఏర్పాటు చేసిన సంచార సైన్స్ ప్రయోగశాల వాహనాన్ని పరిశీలించారు.

పలు సందర్భాలలో మంత్రి మాట్లాడుతూ ఆధార్ కార్డులు లేని వారిని గుర్తించి వెంటనే ఆధార్ కార్డులు జారీ చేయాలని తెలిపారు. ఆర్థిక అక్షరస్యత స్టాల్ పరిశీలించి ఆదివాసి గిరిజనులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రధానమంత్రి జీవనజ్యోతి, అటల్ బీమా యోజ న, అటల్ పెన్షన్ యోజన, ముద్ర రుణాలపై అవగాహన కల్పించాలని తెలిపారు.

ప్రధానమంత్రి విశ్వకర్మ బ్యాంకు లింకేజీలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద పి.వి.టి.జి. గిరిజనులకు 11 రకాల వ్యాధుల పరీక్షలు నిర్వహించి వ్యాధి తీవ్రతను గుర్తించి అవసరమైన మం దులు, శాస్త్ర చికిత్సలు అందించాలని, పి.వి.టి.జి. గ్రామాలలో మొబైల్ యూనిట్ ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. పి.వి.టి.జి. గ్రామాలలో బహులార్ధక ప్రయోజన కేంద్రాల నిర్మాణాలు చేపట్టి ఒకే దగ్గర గిరిజనులకు సేవలు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, మత్స్య సంపద అభివృద్ధి దిశగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద 2 కోట్ల 50 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడుతున్నా మని తెలిపారు. తిర్యాణి మండలం ఆస్పిరేషనల్ బ్లాక్‌గా గుర్తించడం ద్వారా పి.వి.టి.జి. గ్రామాలలో రహదారులు, త్రాగునీరు, వైద్య సేవలు బహుళార్థక ప్రయోజన కేంద్రాల నిర్మాణాలు, పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి సంకల్పం గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి దిశలో ముందుకు సాగుతుందని తెలిపారు.

బేటి బచావో - భేటీ పడావో క్రింద బాలికల విద్య, రక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, పిల్లలను చదివించాలని తల్లిదం డ్రులను కోరారు. కేంద్ర సహాయ మంత్రి చేతుల మీదుగా ఆధార్ కార్డులు, జాబ్ కార్డు లు, జనన ధ్రువీకరణ పత్రాలు, జన్ ధన్ ఖాతా పుస్తకాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, గిరిజనులు పాల్గొన్నారు.