17-01-2026 03:21:19 AM
టేకులపల్లి, జనవరి 16, (విజయక్రాంతి): టేకులపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు గుగులోత్ రమేశ్ ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబానికి రూ.6 లక్షల చెక్కును టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సంస్మరణ సభకు జిల్లా కుటుంబ సంక్షేమ నిధి సొసైటీ కన్వీనర్ డి.దాసు అధ్యక్షత వ హించారు. ముఖ్య అతిథిగా టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చావా దుర్గాభ వాని హాజరై మాట్లాడారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తం గా మరణించిన టీఎస్ యూటీఎఫ్ కుటుం బ సంక్షేమ సొసైటీ సభ్యులకు రూ.3 కోట్లకు పైగా సంఘీభావ విరాళాలు అందజేయడం జరిగిందని తెలిపారు.