calender_icon.png 21 November, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముదిరాజులను ఆగం చేసిన ముఖ్యమంత్రి

21-11-2025 12:31:10 AM

సిద్దిపేట క్రైం, నవంబర్ 20 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజ్ మత్స్యకారుల బతుకులను ఆగం చేసిండని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు. గురువారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయనతోపాటు మేడికాయల వెంకటేశం, కీసరి పాపయ్యలు మాట్లాడారు.

గత ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు ఇచ్చి ముదిరాజులను ఆదుకున్నదన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో మత్స్యకారులకు చేప పిల్లలు, సబ్సిడీ పరికరాలు ఇస్తానని, ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మారుస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారం చేపట్టాక విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే ఆయన అధికారం చేపట్టినట్లుగా ఉందని విమర్శించారు.

ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఉచిత చేప పిల్లలకు ఇవ్వాల్సిన డబ్బులు నేరుగా మత్స్య సొసైటీలోకి బదిలీ చేసి సబ్సిడీ పరికరాలను అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే సర్పంచ్ ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలోపడిగే ప్రశాంత్, సుతారి రాజు, టైగర్ సతీష్, జెట్టి రాజేష్, పెండేలా బాలయ్య, యాట రాజేష్, సిద్ధరబోయిన శ్రీనివాస్, కొత్త శంకర్, చెరుకు నారాయణ పాల్గొన్నారు.