30-12-2025 01:48:50 AM
కరీంనగర్, డిసెంబరు 29 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలో నిర్మాణం పూర్తి చేసుకున్న మొట్ట మొదటి ఇందిరమ్మ గృహాన్ని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సందర్శించారు. సోమవారం అధికారులతో కలిసి 8 డివిజన్ అలుగునూరు లో మొదటి విడుతలో పూర్తున మొట్ట మొదటి ఇందిరమ్మ ఇంటిని పరిశీలించారు. ఇంటి నిర్మాణంను వేగవంతంగా పూర్తి చేసిన లబ్ధిదారుడు అడిచర్ల శ్రీలత సంపత్ దంపతులను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అభినందించారు.
ఈ సంధర్బంగా కమిషనర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల సాకారం కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ పథకంను ప్రవేశపెట్టిందని అన్నా రు. నగరపాలక సంస్థ పరిదిలో ఇప్పటి వరకు కొత్తగా విలీనం చెందిన గ్రామాల డివిజన్లు కలుపుకొని లబ్ధిదారులకు 1400 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఇం దిరమ్మ గృహాలు వివిధ స్థాయిలో నిర్మాణం జరుగుతున్నాయని తెలిపారు. అలుగునూరు ప్రాం తంలో మొట్ట మొదటి ఇందిరమ్మ నివాసం పూర్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ దిలీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.