03-11-2025 03:08:32 AM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కొత్తపల్లి, నవంబరు 2 (విజయ క్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి కు టుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని సు డా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. క రీంనగర్ రూరల్ మండ లం నంగునూరు లో ఇం దిరమ్మ ఇండ్లకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పై ఆర్ధిక భారం పడ్డప్పటికీ నియోజక వర్గానికి మూడు వేల అయిదువందల ఇండ్లు కట్టిస్తున్నామని, మిగిలిన అర్హత గల లబ్ధిదారులకు కూడా విడుతల వారీగా ఇండ్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లక్ష్మణ్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిల్ల రాజు, గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్, ముద్దసాని యాదగిరి, బత్తిని శ్రీనివాస్, కొత్తకొండ శ్రీనివాస్, తదితరులుపాల్గొన్నారు.