02-07-2025 12:33:13 AM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్ జులై 1( విజయ క్రాంతి) పేదల కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని, 10 ఏళ్ల బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇల్లు, రేష న్ కార్డులు ఇవ్వకుండా పేదల ను వంచించిందని పెద్దపల్లి ఎ మ్మెల్యే చింతకుంట విజయరామణారావు అన్నారు. సు ల్తానాబాద్ మండలం నరసయ్య పల్లి గ్రామంలో, శివారు గ్రామం గాంధీనగర్ లో మంగళవారం ఇందిర ఇండ్లకు ఎమ్మెల్యే ముగ్గులు పోశారు.
అలాగే రూ. 33 లక్షల రూపాయల నిధులతో పలు సిసి రోడ్లకు, మహిళ భవనం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అలాగే, నరసయ్య పల్లి గ్రామపంచాయతీ వద్ద జరిగిన సభలో నరసయ్య పల్లి, శివారు గ్రామం గాంధీనగర్, బొంతకుంటపల్లి, దుబ్బపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పేదలకు అందిస్తుందని, రైతులకు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డులు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి అందజేస్తున్నట్టు చెప్పారు. సంవత్సరంన్నర కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అలాగే గ్రామాల్లో అనేక అభివృద్ధి పథకాలను, రోడ్లు, డ్రైనేజీలు రవాణా వంటి మౌలిక సదుపాయాలను చేపట్టడం జరుగుతుందన్నారు.
తాను కూడా 24 గంటల్లో 18 గంటలు ప్రజల కోసం నిర్విరామంగా పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతి నిధులను ఎన్నుకుంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత ముందుకు తీసుకువెళ్లే వీలుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బషీర్, ఎంపీడీఓ దివ్య దర్శన్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, ప్రభుత్వ అధికారులు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు మరియు ,దానాయక్ దామోదర్ రావు, సాయిరి మహేందర్, మండల పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్, జానీ, తిరుమల్ రావు,పన్నాల రాములు,వేగోళం అ బ్బాయి గౌడ్, సందీప్ రావు వెంకటరమణ రావు, భూచ్చి రెడ్డి, కొమురయ్య,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.