08-01-2026 12:00:00 AM
ఎన్టీఆర్ నగర్ డివిజన్ ముఖ్య నాయకుల సమావేశం
ఎల్బీనగర్, జనవరి 7 : మహేశ్వరం నియోజకవర్గంలోని ఎన్టీఆర్ నగర్ డివిజన్ ముఖ్య నాయకుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి హాజరై మాట్లాడారు. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమ లు చేస్తున్న ఆరు గ్యారంటీలను ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరవేయాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పున్న గణేష్ నేత, చిలుక ఉపేందర్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరె క్టర్ బండి మధుసూదన్ రావు, ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ తలాట రమేష్ నేత, నాయకులు గట్ల రవీంద్ర, ముప్పిడి లింగస్వామి గౌడ్, రామకృష్ణ గౌడ్, దుబ్బాక శేఖర్, డాక్యర్ నాయక్, జ్ఞానేశ్వర్ యాదవ్,అక్బర్, అలేటి కిరణ్, మహమ్మద్, షఫీ, పటేల్, కళ్యాణ్ యాదవ్, నబి, విక్రమ్, దినేష్ సింగ్, సైదులు, శ్రవణ్, నగేశ్, రేణుక, సుజాత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.