calender_icon.png 11 January, 2026 | 2:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలు ప్రారంభం

08-01-2026 12:00:00 AM

ఆలేరు, జనవరి 7 (విజయక్రాంతి): ఆలేరు నియోజకవర్గంలోని ఆత్మకూరు బాల బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ సాయుధ పోరాట నాయకులు డా. ఆరుట్ల కమలాదేవి - రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలు 2025-2026లను కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సిహులు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్రీడోత్సవాలను క్రీడాకారులు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో  సభాధ్యక్షులు కొత్త మహదేవ్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, కందుల సత్యనారాయణ జిల్లా విద్యాశాఖాధికారి, యాదాద్రి భువనగిరి, పల్లా వెంకట్రెడ్డి, మాజీ శాసనసభ్యులు మునుగోడు సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, యానాల దామోదర్ రెడ్డి, సి.పి.ఐ. పార్టీ సినీయర్ నాయకులు, ఆత్మకూరు సర్పంచ్ బీసు ధనలక్ష్మీ, ప్రజా ప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.