08-01-2026 12:00:00 AM
తాండూరు, జనవరి 7, (విజయ క్రాంతి): నిజం నిర్భయంగా వార్తలు రాసే దినపత్రిక విజయక్రాంతి అని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ముస్తఫా., తాండూరు డిఎస్పి నర్సింగ్ యాదవ్, శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాల డైరెక్టర్ మణిమాల అన్నారు.
బుధవారం వారు తాండూర్ నియోజకవర్గం విజయక్రాంతి దినపత్రిక ప్రతినిధి అశోక్ కుమార్ గోగికార్ తో కలిసి వేర్వేరుగా 20 26 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దినపత్రిక అనతి కాలంలోనే నిజాలను బయటకి తీసి అన్ని వర్గాల ప్రజా మన్ననలను పొందిందని అన్నారు. మీడియా ప్రతినిధులు రామ్ చందర్ , రాజు తదితరులు పాల్గొన్నారు.