calender_icon.png 24 September, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల్ఫేర్ బోర్డును ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించే కుట్ర మానుకోవాలి

24-09-2025 12:00:00 AM

ములకలపల్లి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి):కార్మికుల సంక్షేమ బోర్డు స్కీములు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే కుట్ర ప్రభు త్వం వెంటనే మానుకోవాలని సిఐటియు మండల కన్వీనర్ నిమ్మల మధు ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ములకలపల్లి లో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న బిల్డింగ్ కార్మికులను పని ప్రాంతా లలో కలుసుకుని మాట్లాడారు. ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల వేల్ఫేర్ బోర్డులో స్కీములకు నిధులు కేటాయించాల్సిందిపోయి వె ల్ఫేర్ బోర్డును ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల కు అప్పజెప్పడం సరైనది కాదని హెచ్చరించారు. కార్మికుల సంక్షేమ బోర్డు నిధుల దు ర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డుకు అడ్వైజర్ కమిటీని వెంటనే నియమించాలని, 2009 నుంచి రెన్యువల్ కానీ కార్డులను యుద్ధ ప్రతిపాదికన రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 12 సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉడత రమణ య్య, గోపాల్,కమల, లక్ష్మీ నారాయణ,మిడి యం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.