24-09-2025 12:01:45 AM
ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు
బోధన్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి) : బోధన్ పట్టణంలో వీధి కుక్కలు స్త్వ్రర విహారం చేస్తున్నా యి. మంగళవారం పట్టణంలోని 19వ వార్డులో వీధి కుక్క కాటుతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయ్యాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన షేక్ ఉమేర్ (2), అలీషా ఫాతిమా (3)లను చికిత్స నిమిత్తం కుటుంబీకులు బోధన్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కలను నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను పట్టణ ప్రజలు కోరుతున్నారు.