06-05-2025 12:30:45 AM
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): మామిడి కాయలు త్వరగా పక్వానికి రావడానికి..వ్యాపారులు కార్బైడ్‌ను వాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్‌తో తుమ్మల ఫోన్‌లో మాట్లాడారు.
మార్కెట్ యార్డుల్లో కార్బైడ్‌ను ఎవరు వాడినా చర్యలు తీసుకోవాలన్నారు. కార్బైడ్ వాడకంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. మంత్రి తుమ్మల ఆదేశాలతో సంబంధిత అధికారులు జాంబాగ్, బాట సింగారం పండ్ల మార్కెట్‌ను సందర్శించి తనిఖీలు చేశారు. మెతాదుకు మించి ఎథోఫోన్, ఎథిలిన్ ప్యాకెట్లను పండ్ల పక్వం కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. వాటి సీజ్ కోసం ఐపీఎం పరిశీలనకు పంపినట్టు తెలిపారు.