calender_icon.png 30 October, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్యాంగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలి

29-10-2025 12:00:00 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 28 (విజయ క్రాంతి) : నవంబర్ 26న ఢిల్లీలో జరగనున్న రాజ్యాంగ హక్కు సాధన సభను విజయ వంతం చేయాలని జాతీయ మాల మహా నాడు మేడ్చల్ జిల్లా కన్వీనర్ గుజ్జుక పరశురాం పిలుపునిచ్చారు. మంగళవారం ఘట్ కేసర్ పట్టణంలో రాజ్యాంగ హక్కుల సాధన సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను జాతీయ మాల మహానాడు మేడ్చల్ జిల్లా కన్వీనర్ పరశురాం ఆధ్వర్యంలో  ఆవి ష్కరించారు.

హలో మాల చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన సభ నవంబర్ 26న జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో జరగ నుంది. రాజ్యాంగ ఆమోద దినోత్సవ సంద ర్భంగా జాతీయ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ సూచన మేర కు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివెళ్లి హలో మాల చలో ఢిల్లీ సభను విజయవంతం చేయడం కోసం   పెద్ద ఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని జిల్లా కన్వీనర్ పరుశురాం కోరారు.  జిల్లా ఉపాధ్యక్షులు పొడిగం ఆంజనేయులు, మున్సిపల్ అధ్య క్షులు ఎజ్జల రఘు, నాయకులు  ప్రవీణ్, మేకల సునీల్ కుమార్  పాల్గొన్నారు.