19-07-2025 12:00:00 AM
నిజం సాగర్ నీటిని విడుదల చేయండి , కలెక్టర్ ను కోరిన బిజెపి జిల్లా కార్యవర్గం
నిజామాబాద్ జులై 18:(విజయ క్రాంతి): ఇప్పటివరకు పంటలకు మీరు అందడం లేదని వర్షాలు కొరియకపోవడంతో ఏర్పడిన వర్ష భావం వల్ల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొం దని వెంటనే ప్రభుత్వం నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని బీజేపీ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి జిల్లా బీజేపీ నాయకులు కలెక్టర్ టీ. వినయ్ కృష్ణ రెడ్డి ని కలసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనకార్ లక్ష్మి నారాయణ, ఉపాధ్యక్షలు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు మాస్టర్ శంకర్, పంచారెడ్డి శ్రీధర్, ప్రమోద్, జగన్ రెడ్డి, నారాయణ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు.