29-01-2026 12:16:25 AM
నవభారత్ ఏరియాలో ఇబ్బడి ముబ్బడిగా ఫ్లెక్సీలు.
చోద్యం చూస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 28 (విజయక్రాంతి):రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలలో ఎన్నికల నీయమ నిబంధనలు అమలులో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో ఎన్నికల నియమావళి అమలు జరగడం లేదు. ఎన్నికల కమిషన్ 24 గంటల క్రితం నోటిఫికేషన్ జారీ చేశారు. వెంటనే ఎన్నికలను నిబంధనలు అమల్లోకి వచ్చాయని ప్రకటించారు.
నిబంధనల ప్రకారం పట్టణ పరిధిలో ఎలాంటి ఫ్లెక్సీలు, రాజకీయ ప్రచారాలు, ఎన్నికల గుర్తులు ప్రచారం చేయరాదని నిబంధన ఉంది. బుధవారం మధ్యాహ్నం వరకు పాల్వంచ పట్టణ పరిధిలోని పాత పాల్వంచ నుంచి నవ భారతి ఏరియా వరకు విచ్చలవిడిగా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని తొలగించకుండా చోద్యం చూస్తున్నారు. తక్షణమే వారిపై ఎన్నికల నియమావళి అతిక్రమణ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.