29-01-2026 12:17:34 AM
ముగ్గురిపై కేసు నమోదు
ఆళ్ళపల్లి, జనవరి28, (విజయ క్రాంతి) : రేగళ్ల రేంజ్ పరిధిలోని మర్కోడు నుండి అక్రమంగా తరలిస్తున్న ముష్టిగింజల బొలెరో వాహనాన్ని అటవీ శాఖ అధికారులు పట్టుకొని సీజ్ చేయడం జరిగింది, బారి మొత్తంలో సుమారు 1150 kg ల ముష్టిగింజలను ఎటువంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారం తో రేగళ్ల రేంజ్ సిబ్బంది అట్టి వాహనాన్ని పట్టుకొని సీజ్ చేయడం జరిగింది,
అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. ఈ ఈ సందర్భంగా రేగళ్ల రేంజ్ అధికారి జస్వంత్ ప్రసాద్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఆటవి ఉత్పత్తులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేగళ్ల రేంజ్ ఎఫ్ బి వో లు నారాయణ సింగ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు