25-12-2025 12:06:59 AM
గీతంలో ఆర్ట్ స్కేప్-25 పేరిట మూడు రోజుల వేడుకలు
పటాన్ చెరు, డిసెంబర్ 24 : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్‌ఎస్)లోని లలిత, ప్రదర్శన కళల విభాగం ఆధ్వర్యంలో నృత్యం, సంగీతం, దృశ్య కళలను వేడుకగా జరుపుకునే మూడు రోజుల సాంస్కృతిక ఉ త్సవం ‘ఆర్ట్ స్కేప్-25’ను విజయవంతంగా నిర్వహించారు. జీఎస్ హెచ్‌ఎస్ డైరెక్టర్ డాక్ట ర్ శామ్యూల్ తరు, లలిత, ప్రదర్శన కళల విభాగాధిపతి డాక్టర్ లలిత సింధూరిల సమక్షంలో ఈ ఉత్సవాన్ని గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు ప్రారంభించారు.
మొదటి రోజు వి ద్వాన్ డి.శ్రీనివాస్ డివైన్ స్ట్రింగ్స్ పేరిట నిర్వహించిన వీణా కచేరీ మంత్రముగ్ధులను చేసి, శుభారంభాన్ని అందించింది. ముత్తుస్వామి దీక్షితార్ స్వరపరిచిన మహాగణపతిం కీర్తనతో ప్రారంభమై, ఒక శుభప్రదమైన, ఉత్తేజ కరమైన వాతావరణాన్ని నెలకొల్పింది. దీని తరువాత త్యాగరాజ ప్రసిద్ధ కీర్తనలైన బ్రోవభారమా, నగుమోములను ఆలపించారు.