18-11-2025 01:01:21 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్(విజయక్రాంతి): సౌదీలో జరిగిన ప్రమాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. ఈ విషయమై విదేశాంగ శాఖ అధికారులు, హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి, పలు సూచనలు చేశారు. ఈ దుర్ఘటనకు సంబంధించి బాధితులకు సహాయం అందించేందుకు కేంద్రం యుద్ద ప్రాతిపదికన రంగంలోకి దిగిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులకు, మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయక చర్యలను సౌదీలోని భారత దౌత్యవేత్తలు ప్రారంభించారని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పటికే సౌదీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నారని చెప్పారు.
బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో యాత్రికుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.