calender_icon.png 31 December, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణితం పట్ల మక్కువ పెంచుకోవాలి

31-12-2025 12:05:11 AM

జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి

ములుగు, డిసెంబర్30,(విజయక్రాంతి): ఈనాటి ఆధునిక శాస్త్రసాంకేతిక మరియు కృత్రిమ మేధా యుగంలో గణితశాస్త్రమే కీలక భూమిక పోషిస్తున్నదని, విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే గణితం పట్ల మ క్కువ పెంచుకొని గణిత సామర్థ్యాలపై పట్టు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సి ద్ధార్థ రెడ్డి అన్నారు.

జిల్లా కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా గణిత ఫోరం అధ్యక్షులు ఏళ్ల మధుసూదన్, ప్రధాన కార్యదర్శి చందా భద్రయ్యల సారథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పోటీల్లో ములుగు జిల్లాలోని 10 మండలాల నుంచి మండల స్థాయిలో విజేతలుగా నిలిచిన 35 మంది విద్యార్థులు పాల్గొన్నార ని, ఉదయం 11.00 గంటలకు గణిత ప్రతి భా పరీక్ష ప్రశ్నాపత్రాలను జిల్లా గణిత ఫో రం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, రాష్ట్ర పరిశీలకులు, రాష్ట్ర బాధ్యులు మ రియు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప నిచేస్తున్న సెక్టోరియల్ అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరించి పరీక్షను విజయవంతంగా నిర్వహించారు.

అనంతరం మూ ల్యాంకన ప్రక్రియ పూర్తిచేసి, జిల్లా గణిత ఫో రం అధ్యక్షులు ఏళ్ల మధుసూదన్ గారి అధ్యక్షతన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో ఏ. సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏ రంగంలో అయినా విజయం సాధించాలంటే ప్రాథమిక గణిత భావనలే పునాది అ ని, గణితాన్ని కేవలం పాఠ్యాంశంగా కాకుండా నిజ జీవిత సమస్యల పరిష్కారాని కి ఉపయోగించే విధంగా నేర్చుకోవాలని వి ద్యార్థులకు సూచించారు.

అలాగే గ్రామీణ, వెనుకబడిన ములుగు జిల్లాలో గణిత విద్య వ్యాప్తికి కృషి చేస్తున్న తెలంగాణ గణిత ఫోరం నాయకులు, గణిత ఉపాధ్యాయుల ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల గణిత సామర్థ్యాలను పెంపొందించేందుకు వర్క్బుక్ల రూ పకల్పన చేసి అమలు చేస్తున్న గణిత ఫోరం, రిసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయుల సేవలు ప్ర శంసనీయమని పేర్కొన్నారు.

ఈ సందర్భం గా జిల్లా గణిత ఫోరం అధ్యక్షులు ఏళ్ల మధుసూదన్ మాట్లాడుతూ..ఉపాధ్యాయుల వృ త్తి పరమైన అభివృద్ధికి, విద్యార్థుల్లో గణిత సామర్థ్యాల పెంపుదలకు, గుణాత్మకమైన విద్య సాధనకు గణిత ఫోరం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. గణితంలో ఉత్త మ ఫలితాల సాధన కోసం తెలంగాణ గణిత ఫోరం పటిష్టమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గణిత ఫోరం రాష్ట్ర పరిశీలకులు అడిక సతీష్, రాష్ట్ర సలహాదారు డా. కందాల రామయ్య, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు హర్షం రాజు, శ్యాంసుం దర్ రెడ్డి, గుల్లపల్లి సాంబయ్య, సైకం శ్రీనివా స్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా భ ద్రయ్య, కోశాధికారి చింతోజు సుమన్, ప్ర ధానోపాధ్యాయులు క్యాతం రాజేందర్, ఫిజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షులు సతీష్, తదిత రులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశంసా పత్రాలు అందజేశారు.