calender_icon.png 25 November, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకరూప చీరల పంపిణీ సమానత్వానికి ప్రతీక

25-11-2025 12:00:00 AM

ములకలపల్లి, నవంబర్ 24 (విజయ క్రాంతి):సమానత్వానికి ప్రతీకగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఏకరూప చీరల పంపిణీ కార్యక్రమం నిలుస్తుందని కాంగ్రెస్ మండల నాయకుడు సురభి రాజేష్ అన్నారు. సోమవారం ములకలపల్లి మండలం జగన్నాధపు రం పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఇందిరమ్మ చీరల పంపిణీ ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మ హిళలకు నాణ్యమైన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.

అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ నేతృ త్వంలో ఇందిరమ్మ చీరల పంపిణీతో పండ గ వాతావరణం నెలకొన్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ తెలంగాణలోని మహిళా సోదరీమణులకు అన్నదమ్ములు ఇచ్చే సారె తో సమానమని పేర్కొన్నారు. గ్రామ సమైక్య బాధ్యులు షఫియా, షేక్ జలీల్, డ్వాక్రా సంఘ మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.