25-11-2025 12:00:00 AM
ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్
మరిపెడ, నవంబర్24 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో మహిళలు ఆర్థికంగా ఎదగాలని డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్రంలోని మహిళలకు, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనుస్తూ, సంక్షేమ పథకాలాలలో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీ లేని రుణాలు, ఇందిరా మహిళా శక్తి ద్వారా పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. వంటి స్వయం ఉపాధి రంగాలలో మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో మరిపెడ మండల తహసిల్దార్ కృష్ణవేణి, స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, ఏ పి యం అలివేలు మంగ, ఎంపీ ఓ సోమలాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్, పిఎసిఎస్ మాజీ చైర్మన్ యాదగిరి రెడ్డి, మాజీ సర్పంచ్ రాంలాల్ , కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.