25-11-2025 12:00:00 AM
రాష్ట్ర పంచాయతీ రాజ్, మంత్రి సీతక్క
ఏటూరునాగారం, నవంబరు24(విజయక్రాంతి):ప్రతి గుత్తి కోయ గుడాల్లో సోలార్ విద్యుత్,బోర్ వెల్స్ ఏర్పాటు చేస్తామని అటవీ ప్రాంతంలో నివసించే వారు అటవీకి హాని కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
సోమవారం ఏటూరునాగారం మండలంలోని బుటారం గుత్తికోయ గూడెంలో రిలియబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సహకారం తో చింతలపాడు, గుండంగా వాయ్, గంటలకుంటల గుత్తి కోయలకు 208 బ్లాంకెట్స్, స్వెటర్లనురాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణిలతో కలసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రిలియబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారి సహకారం తో చింతలపాడు, గుండంగా వాయ్, గంటలకుంటల గుత్తి కోయలకు 208 బ్లాంకెట్స్, స్వెటర్లను అందించడం జరిగిందని అటవీ ప్రాంతాలలో నివసించే గుత్తి కోయలకు సేవ చేయాలని ఆలోచనతో ముందుకు వచ్చిన ట్రస్ట్ వారిని మంత్రి ప్రశంసించారు.
గుత్తి కోయ గుంపులలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి ఈ ప్రాంతాలలో సోలార్ విద్యుత్ దీపాలను, బోర్లు వేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో రూపొందిస్తుందని తెలిపారు.అటవీ మధ్య ప్రాంతంలో ఉండే గుత్తి గుంపు ఆదివాసీలు ఇకపై ఎవరూ కూడా అడవిని హరించకూడదని దానికి మీరే సంరక్షకులుగా ఉంటూ అడవి తల్లితో ఉపాధి పొందాలని అన్నారు.