calender_icon.png 17 August, 2025 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జెండా ఎగరవేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

16-08-2025 12:00:00 AM

నిర్మల్, ఆగస్టు 15(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనం గా నిర్వహించారు. క్యాంపు కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అలాగే జిల్లా ఎస్పీ కార్యాలయం లో ఎస్పీ జానకి షర్మిల జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు పాఠశాల విద్యార్థులతో కలిసి జాతీయ గీతాలపన చేశారు.

అంతకుముందు పోలీసులు గౌరవ వందనం సమ ర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్‌లు ఫైజాన్ అహ్మ ద్, కిషోర్ కుమార్, ఎస్పీలు రాకేష్ మీనా అవినాష్ కుమార్ కలెక్టర్ క్యాంపు కార్యాలయ అధికారులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే నిర్మల్ పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జడ్పిసిఓ గోవిందు జడ్పీ ఉద్యోగులు పాల్గొన్నారు