28-10-2025 07:30:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): గ్రూప్-1 పరీక్షలో అర్హత సాధించి, ఇటీవల జిల్లాలోని నాలుగు మండలాలకు కేటాయించబడిన నలుగురు ఎంపీడీవోలు, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌ను సోమవారం రాత్రి, వారి కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపీడీవో విధులు, బాధ్యతలు గురించి వివరించారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న పథకాలన్నీ అర్హులైన పేదలందరికీ అందేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కష్టపడి పని చేస్తూ, విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఉద్యోగ జీవితంలో భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.