కమనీయం.. నారసింహుడి తిరుకళ్యాణం
బెజ్జంకి,మార్చి29: బెజ్జంకి మండల కేంద్రంలోని ఏకశిల గుట్టపై వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ఆదివారం తీరుకళ్యాణ మహోత్సవం భక్తి వైభవాలతో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏటా జరిగే ఈ దివ్యోత్సవానికి పరిసర గ్రామాల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చే సంప్రదాయం కొనసాగుతోంది.వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్ల దివ్య కల్యాణం అత్యంత శోభాయమానంగా జరగనుంది.
ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకారాలు, హోమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. గుట్టపై జై నరసింహ స్వామి నినాదాలతో ఆ పరిసర ప్రాంతం భక్తి పరవశంతో మారుమోగింది. ఆలయ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీరు, కూర్చునే ఏర్పాట్లు, ప్రసాద పంపిణీ, భక్తుల రాకపోకలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య కళ్యాణాన్ని దర్శించారు.స్థానిక ఎస్‌ఐ సౌజన్య ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కళ్యాణం లో చైర్మన్ జెల్ల ప్రభాకర్, గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న,కమిటీ డైరెక్టర్లు,స్థానిక పరిసర ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




